22 నుంచి నోవా అగ్రిటెక్ పబ్లిక్ ఇష్యూ
ABN , Publish Date - Jan 18 , 2024 | 05:25 AM
భూసార నిర్వహణ, పంట ఉత్పత్తికారకాల, పోషకాలను తయారు చేస్తున్న నోవా అగ్రిటెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.144 కోట్లు సమీకరించనుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భూసార నిర్వహణ, పంట ఉత్పత్తికారకాల, పోషకాలను తయారు చేస్తున్న నోవా అగ్రిటెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.144 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ జనవరి 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. దరఖాస్తుకు ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.39-41గా నిర్ణయించింది. కనీసం 365 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.2 ముఖ విలువ కలిగిన రూ.112 కోట్ల విలువైన కొత్త షేర్లను ఇష్యూలో జారీ చేస్తారు. ఓఎఫ్‌ఎస్ కింద ప్రమోటర్ నూతలపాటి వెంకటసుబ్బారావు 77,58,620 షేర్లను విక్రయిస్తారు.