Share News

జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:36 AM

కొనుగోళ్ల మద్దతుతో ఈక్విటీ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలో మార్కెట్‌ సూచీలు పయనించాయి. దీంతో సోమవారం నిఫ్టీ కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలు...

జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ

ముంబై: కొనుగోళ్ల మద్దతుతో ఈక్విటీ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలో మార్కెట్‌ సూచీలు పయనించాయి. దీంతో సోమవారం నిఫ్టీ కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలు నమోదు చేయగా ఇన్వెస్టర్ల సంపద కూడా కొత్త రికార్డును నమోదు చేసింది. సెన్సెక్స్‌ 281.52 పాయింట్ల లాభంతో 72,708.16 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో 17 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 81.55 పాయింట్ల లాభంతో 22,122.25 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 22,186.65 పాయింట్ల స్థాయిని తాకింది. ఈ రెండూ కొత్త రికార్డు స్థాయిలే. నిఫ్టీలోని 50 షేర్లలో 27 లాభాలతో ముగిశాయి.

కొత్త శిఖరాలకు సంపద: మార్కెట్లో కొనుగోళ్ల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయున కంపెనీల మార్కెట్‌ విలువ సోమవారం రూ.2,19,581.56 కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద కొత్త రికార్డు రూ.391.69 లక్షల కోట్లకు దూసుకుపోయింది.

22న జీపీటీ హెల్త్‌కేర్‌ ఇష్యూ

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ జీపీటీ హెల్త్‌కేర్‌ ఇష్యూ గురువారం (తేదీ 22) ప్రారంభమై వచ్చే సోమవారం (తేదీ 26) ముగుస్తుంది. షేరు ధర శ్రేణిని రూ.177-186గా కంపెనీ ప్రకటించింది. ఈ ఐపీఓ కనిష్ఠ ధరలో రూ.501.67 కోట్లు, గరిష్ఠ ధరలో రూ.525.14 కోట్లు సమీకరించగలుగుతుంది. ఇష్యూలో భాగంగా 2.6 కోట్ల షేర్లను ఓఎ్‌ఫఎస్‌ విధానంలో విడుదల చేస్తారు. రూ.40 కోట్ల విలువ గల తాజా షేర్లు మార్కెట్లో విక్రయానికి పెడతారు.

  • టోలిన్స్‌ టైర్స్‌ కంపెనీ రూ.230 కోట్ల విలువ గల పబ్లిక్‌ ఇష్యూ జారీకి అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది.

Updated Date - Feb 20 , 2024 | 04:43 AM