Share News

పదేళ్లలో నిఫ్టీ వృద్ధి 240%

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:42 AM

గడిచిన పదేళ్లలో స్టాక్‌ మా ర్కెట్‌ సూచీలు భారీ వృద్ధిని కనబరిచాయి. 2014 హోలీ నాటికి 6,494 పాయింట్ల వద్దనున్న నిఫ్టీ-50 సూచీ.. 2024 హోలీ నాటికి 240 శాతం వృద్ధితో 22,096 పాయింట్ల స్థాయికి చేరుకుంది. అలాగే, సెన్సెక్స్‌ కూడా 22,096 పాయింట్ల స్థాయి నుంచి 230 శాతం...

పదేళ్లలో నిఫ్టీ వృద్ధి 240%

సూచీలోని 50 కంపెనీల్లో 47 మల్టీబ్యాగర్లు

ముంబై: గడిచిన పదేళ్లలో స్టాక్‌ మా ర్కెట్‌ సూచీలు భారీ వృద్ధిని కనబరిచాయి. 2014 హోలీ నాటికి 6,494 పాయింట్ల వద్దనున్న నిఫ్టీ-50 సూచీ.. 2024 హోలీ నాటికి 240 శాతం వృద్ధితో 22,096 పాయింట్ల స్థాయికి చేరుకుంది. అలాగే, సెన్సెక్స్‌ కూడా 22,096 పాయింట్ల స్థాయి నుంచి 230 శాతం పెరుగుదలతో 72,831 వద్దకు చేరుకుంది. 2015 మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో నిఫ్టీ పాజిటివ్‌ వృద్ధిని నమోదు చేసింది. 2021లో అత్యధికంగా 24 శాతం రిటర్న్‌లు పంచింది. 2023 లో సూచీ 20 శాతం పుంజుకుంది. గత ఏడాదిలో నిఫ్టీ తొలిసారిగా 19, 20, 21 వేల కీలక మైలురాళ్లను అధిగమించింది. కాగా, ఈ పదేళ్లలో నిఫ్టీ-50లోని 47 కంపెనీలు మల్టీ బ్యాగర్‌ రిటర్నులు పంచాయి. అందులో 14 కంపెనీల షేర్ల ధరలు 500 నుంచి 3,900 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా భారత్‌

2014 డిసెంబరులో తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటిన మార్కెట్‌ సంపద (బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌).. గత ఏడాది నవంబరు 29న రూ.333 లక్షల కోట్లకు (4 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ప్రస్తుతం రూ.382 లక్షల కోట్ల స్థాయికి పెరిగింది. అంతేకాదు, మార్కెట్‌ క్యాప్‌ పరంగా గత ఏడాది హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది. 2030 నాటికి భారత ఈక్విటీ మార్కెట్‌ సంపద 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్‌ అంచనా వేసింది.

అత్యధికంగా వృద్ధి చెందిన నిఫ్టీ-50 షేర్లు

కంపెనీ వృద్ధి (%)

బజాజ్‌ ఫైనాన్స్‌ 3,913

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2,103

టైటన్‌ 1,353

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 1,029

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 856

Updated Date - Mar 26 , 2024 | 01:42 AM