డబ్ల్యూఈఎఫ్ టెక్ పయనీర్ జాబితాలో నెక్ట్స్‌వేవ్
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:47 AM
భారత్‌కు చెందిన 10 స్టార్టప్‌లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) టెక్నాలజీ పయనీర్ 2024 జాబితాలో చోటు లభించింది. ఇందులో టెక్నాలజీ, ఎడ్యుకేషన్ రంగాల్లో కృషి చేస్తున్న హైదరాబాద్‌కు...

మరో 10 స్టార్టప్‌లకు చోటు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 10 స్టార్టప్‌లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) టెక్నాలజీ పయనీర్ 2024 జాబితాలో చోటు లభించింది. ఇందులో టెక్నాలజీ, ఎడ్యుకేషన్ రంగాల్లో కృషి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన నెక్స్ట్‌వేవ్ కూడా ఉంది. తెలుగు రాష్ర్టాల నుంచి ఈ అరుదైన గౌరవం పొందిన తొలి ఎడ్‌టెక్ స్టార్టప్ ఇదే. కృత్రిమ మేథ (ఏఐ) నుంచి స్వచ్ఛ ఇంధన సొల్యూషన్లు, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్, అంతరిక్షం, బయో టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ వరకు విభిన్న టెక్ రంగాల్లో పని చేస్తున్న 100 అగ్రగామి స్టార్ట్‌పలతో డబ్ల్యూఈఎఫ్ ఈ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న ఇతర భారతీయ స్టార్ట్‌పలలో పిక్సెల్, నిరామయ్, సర్వం ఏఐ, యాంపియెర్‌అవర్, క్రాపిన్, ఎంట్రీ, హెల్త్‌పిక్స్, ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ, స్ర్టింగ్ బయో ఉన్నాయి.