Share News

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు: ఐఆర్‌డీఏఐ

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:29 AM

ఏప్రిల్‌ 1 నుంచి సరెండర్‌ చార్జీలతో సహా అనేక బీమా నిబంధనలు మారనున్నాయి. ఈ చార్జీల వివరాలను కంపెనీలు ముందుగానే పాలసీహోల్డర్లకు తెలపాలని స్పష్టం చేస్తూ ఐఆర్‌డీఏఐ ఆరు ఆదేశాలు జారీ చేసింది...

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు: ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి సరెండర్‌ చార్జీలతో సహా అనేక బీమా నిబంధనలు మారనున్నాయి. ఈ చార్జీల వివరాలను కంపెనీలు ముందుగానే పాలసీహోల్డర్లకు తెలపాలని స్పష్టం చేస్తూ ఐఆర్‌డీఏఐ ఆరు ఆదేశాలు జారీ చేసింది. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా బీమా కంపెనీలు సిద్ధమవడం, బీమా వ్యాపార సరళీకరణ, బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెంచడం లక్ష్యంగా ఐఆర్‌డీఏఐ ఈ ఆరు నియంత్రణలు రూపొందించింది. దీంతో బీమా పాలసీల రూపకల్పన, ప్రీమియం నిర్ణయం, హామీతో కూడిన సరెండర్‌ వాల్యూ నిబంధనలు, ప్రత్యేక సరెండర్‌ వాల్యూ విధానం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్‌ చేస్తే బీమా కంపెనీలు అప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం, ఆ పాలసీపై అప్పటి వరకు సమకూరిన రాబడి లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని చెల్లించాలి. అదే మూడేళ్ల తర్వాత సరెండర్‌ చేస్తే కొద్దిగా ఎక్కువ మొత్తం చెల్లించాలి.

Updated Date - Mar 27 , 2024 | 01:29 AM