Share News

ఎన్‌సీసీ టర్నోవర్‌ 31 శాతం వృద్ధి

ABN , Publish Date - May 16 , 2024 | 05:02 AM

ఇన్‌ఫ్రా రంగంలోని ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ అనుబంధ కంపెనీలతో కలిసి...

ఎన్‌సీసీ టర్నోవర్‌ 31 శాతం వృద్ధి

ఒక్కో షేరుపై రూ.2.20 డివిడెండ్‌

హైదరాబాద్‌: ఇన్‌ఫ్రా రంగంలోని ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.6,530.05 కోట్ల టర్నోవర్‌పై రూ.239.16 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ టర్నోవర్‌ 31 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ కన్సాలిడేటెట్‌ టర్నోవర్‌ రూ.15,701 కోట్ల నుంచి రూ.20,970.91 కోట్లకు, నికర లాభం రూ.609,20 కోట్ల నుంచి రూ.710.69 కోట్లకు చేరాయి. ఆర్థిక ఫలితాలు బాగుండడంతో రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై వాటాదారులకు రూ.2.20 (110 శాతం) చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ కొత్తగా రూ.27,283 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. దీంతో ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ రూ.57,536 కోట్లకు చేరింది.

Updated Date - May 16 , 2024 | 05:02 AM