Share News

హైదరాబాద్‌లో మోడ్‌మెడ్‌ జీసీసీ కేంద్రం

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:02 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులకు ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ క్లౌడ్‌ సేవలు అందించే మోడ్‌మెడ్‌ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను...

హైదరాబాద్‌లో మోడ్‌మెడ్‌ జీసీసీ కేంద్రం

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులకు ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ క్లౌడ్‌ సేవలు అందించే మోడ్‌మెడ్‌ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. కంపెనీకి భారత్‌లో ఇదే తొలి జీసీసీ కేంద్రం. ఈ కేంద్ర నిర్వహణ కోసం మోడ్‌మెడ్‌ ఇప్పటికే 100 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఈ ఏడాది చివరికల్లా వీరి సంఖ్య 200కు చేరనుంది. ‘మోడ్‌మెడ్‌ ప్రయాణంలో ఇదో మైలురాయి. హైదరాబాద్‌ టెక్‌ ఎకోసిస్టమ్‌, నిపుణులైన ఉద్యోగుల లభ్యత మా అభివృద్ధిని మరింత వేగిరం చేస్తాయని భావిస్తున్నాం’ అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డేనియల్‌ కేన్‌ చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 06:52 AM