Share News

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:08 AM

అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, యాపిల్‌ను వెనక్కి నెట్టి మైక్రోసాఫ్ట్‌ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ వారంలో మైక్రోసాఫ్ట్‌ షేర్లు 3 శాతానికి పైగా...

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌

న్యూయార్క్‌: అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, యాపిల్‌ను వెనక్కి నెట్టి మైక్రోసాఫ్ట్‌ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ వారంలో మైక్రోసాఫ్ట్‌ షేర్లు 3 శాతానికి పైగా పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) 2.89 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో యాపిల్‌ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించడంతో, సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.87 లక్షల కోట్ల డాలర్లకు జారుకుంది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లోనూ కొద్ది సమయం పాటు మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ యాపిల్‌ను మించినప్పటికీ, మళ్లీ కిందికి జారుకుంది. ప్రపంచంలోని విలువైన కంపెనీల లిస్ట్‌లో మైక్రోసాఫ్ట్‌ నం.1 స్థానానికి చేరుకోవడం 2021 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. జనరేటివ్‌ ఏఐ అప్లికేషన్‌ చాట్‌ జీపీటీ అభివృద్ధి సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులతో పాటు చాట్‌జీపీటీని తన ఉత్పత్తుల్లో వినియోగించుకోనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించడం కంపెనీ షేర్ల ర్యాలీకి దోహదపడింది. కాగా, యాపిల్‌ ఐఫోన్ల గిరాకీ మందగించడం సంస్థ షేర్ల విలువ క్షీణతకు కారణమైంది.

Updated Date - Jan 14 , 2024 | 03:08 AM