Share News

రఘువంశీ నుంచి మైక్రో టర్బోజెట్‌ ఇంజన్‌

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:39 AM

అంతరిక్షం, రక్షణ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ రఘువంశీ మెషీన్‌ టూల్స్‌ (ఆర్‌వీఎంటీ).. ‘ఇండ్‌రా ఆర్‌వీ25: 240ఎన్‌’ పేరుతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన...

రఘువంశీ నుంచి మైక్రో టర్బోజెట్‌ ఇంజన్‌

హైదరాబాద్‌: అంతరిక్షం, రక్షణ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ రఘువంశీ మెషీన్‌ టూల్స్‌ (ఆర్‌వీఎంటీ).. ‘ఇండ్‌రా ఆర్‌వీ25: 240ఎన్‌’ పేరుతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన మైక్రో టర్బోజెట్‌ ఇంజన్‌ను ఆవిష్కరించింది. ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, రక్షణ శాఖ మాజీ శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ జీ సతీశ్‌ రెడ్డి సమక్షంలో దీన్ని సోమవారం విడుదల చేసింది. పూర్తిగా దేశీయంగా మైక్రో టర్బోజెట్‌ ఇంజన్‌ అభివృద్ధి చేసినందుకు గర్వంగా ఉందని.. ఏరోస్పేస్‌ ఆవిష్కరణలకు అంతర్జాతీయ హబ్‌గా ఎదిగేందుకు మనకున్న బుద్ధి కుశలత, కృతనిశ్చయానికిదే నిదర్శనమని ఆర్‌వీఎంటీ ఎండీ వంశీ వికాస్‌ అన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 04:39 AM