Share News

నవనామి నుంచి ‘మెగాలీవో’ ప్రాజెక్టు

ABN , Publish Date - May 24 , 2024 | 03:05 AM

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నవనామి ప్రాజెక్ట్స్‌ హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు చేపట్టింది. అప్పా జంక్షన్‌ వద్ద ‘మెగాలీవో’ పేరుతో చేపట్టిన ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లు ఖర్చు ...

 నవనామి నుంచి ‘మెగాలీవో’ ప్రాజెక్టు

ఫ్లాటు ధర రూ8-12 కోట్లు

హైదరాబాద్‌: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నవనామి ప్రాజెక్ట్స్‌ హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు చేపట్టింది. అప్పా జంక్షన్‌ వద్ద ‘మెగాలీవో’ పేరుతో చేపట్టిన ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.250 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా, మిగ తా మొత్తాన్ని అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని కంపెనీ ఎండీ నవీన్‌ గద్దె చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4.1 ఎకరాల్లో 50 అంతస్తుల్లో 150 ఫ్లాట్లతో రెండు టవర్లు నిర్మిస్తామన్నారు. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం 8,888 ఎస్‌ఎ్‌ఫటీ, 9,999 ఎస్‌ఎ్‌ఫటీ, 11,111 ఎస్‌ఎ్‌ఫటీ మధ్య ఉంటాయన్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో ఫ్లాటు ధర కనిష్ఠంగా రూ.8 కోట్లు, గరిష్ఠంగా రూ.12 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌, రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలకు 15 నుంచి 20 నిమిషాల డ్రైవింగ్‌తో చేరుకునే ‘మెగాలీవో’ ప్రాజెక్టు నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని నవీన్‌ గద్దె చెప్పారు.

Updated Date - May 24 , 2024 | 03:05 AM