హైదరాబాద్‌లో ఎల్‌ఎస్‌ఈజీ ఎక్సలెన్స్ కేంద్రం
ABN , Publish Date - Jan 19 , 2024 | 05:23 AM
ఎల్‌ఎ్‌సఈజీ (లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గ్రూప్) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎల్‌ఎ్‌సఈజీ (లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గ్రూప్) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా నిపుణుల లభ్యతను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎల్‌ఎ్‌సఈజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన ఇంజనీరింగ్ సొల్యూ షన్లను అందించడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ప్రస్తుతం 300 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేశారు. 2025 చివరి నాటికి మరో 1000 మంది ఇంజనీర్లు, నిపుణులను నియమించుకోనున్నట్లు హుస్సేన్ చెప్పారు.