Share News

లాభాల స్వీకారంతో నష్టాలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 02:37 AM

స్టాక్‌మార్కెట్‌ సోమవారం నష్టాలతో ముగిసిం ది. ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో చివరి గంటలో లాభాల స్వీకరణ అమ్మకాలు హోరెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 354.21 పాయింట్ల నష్టంతో...

లాభాల స్వీకారంతో నష్టాలు

ముంబై: స్టాక్‌మార్కెట్‌ సోమవారం నష్టాలతో ముగిసిం ది. ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో చివరి గంటలో లాభాల స్వీకరణ అమ్మకాలు హోరెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 354.21 పాయింట్ల నష్టంతో 71,731.42 వద్ద, నిఫ్టీ 82.10 పాయింట్ల నష్టంతో 21,771.70 వద్ద క్లోజయ్యాయి.

రూ.1,000 పైకి ఎల్‌ఐసీ షేరు: ఎల్‌ఐసీ షేర్లలో సోమవారం మంచి కదలిక కనిపించింది. బీఎస్‌ఈలో ఈ షేర్లు 5.90 శాతం లాభంతో రూ.1,000.35 వద్ద ముగిశాయి. దీంతో ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాప్‌ సోమవారం ఒక్క రోజే రూ.35,230.25 కోట్లు పెరిగి రూ.6,32,721.15 కోట్లకు చేరింది. ఇంట్రాడేలో ఒక దశలో ఎల్‌ఐసీ షేర్లు 8.81 శాతం లాభంతో రూ.1,027.95కు చేరి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. లిస్టింగ్‌ తర్వాత మదుపరులకు చుక్కలు చూపించిన ఎల్‌ఐసీ షేర్లు రూ.1,000 మార్క్‌ను అధిగమించడం ఇదే మొదటిసారి.

‘హ్యుండయ్‌’ నుంచి రూ.46,513 కోట్ల ఐపీఓ!: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎం ఐఎల్‌) భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది చివర్లో 330 నుంచి 560 కోట్ల డాలర్ల (సుమారు రూ.27,409 కోట్ల నుంచి రూ.46,513 కోట్లు) సమీకరణ కోసం ఐపీఓకు వస్తుందని సమాచారం. ఇదే జరిగితే భార త ఐపీఓ మార్కెట్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. అయితే ఈ వార్తలపై హుండయ్‌ మోటార్‌ ఇండియా అధికారికంగా నోరు మెదపడం లేదు.

Updated Date - Feb 06 , 2024 | 02:37 AM