Share News

ఫార్మా, ఎనర్జీ షేర్లపై కన్నేయండి

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:55 AM

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో...

ఫార్మా, ఎనర్జీ షేర్లపై కన్నేయండి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో మదుపరుల్లో నెలకొన్న గందరగోళం తొలగింది. ఈ వారం నిఫ్టీ 22,700 పాయింట్లను అధిగమిస్తే 22,900 పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. బ్యాంకు నిఫ్టీ 48,900 పాయింట్ల స్థాయిని అధిగమిస్తే 49,600 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఫార్మా, ఎనర్జీ కంపెనీల షేర్లు లైమ్‌లైట్‌లో ఉండవచ్చు.

ఈ వారం స్టాక్‌ రికమండేషన్లు...

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి స్వల్పకాలిక దిద్దుబాటులో ఉన్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీ షేర్లకు రూ.1,520 వద్ద కీలక మద్దతు లభించింది. ప్రస్తుతం ఈ కౌంటర్‌ క్రాస్‌ ట్రెండ్‌లైన్‌ను బ్రేక్‌ చేసి మార్చి మూడో వారం నుంచి అదరగొడుతోంది. డెలివరీ వాల్యూమ్స్‌ కూడా పెరుగుతున్నాయి. కొత్త రుణాల్లో నాలుగు శాతం వృద్ధి నమోదు కావడం మరో కలిసొచ్చే అంశం. గత వారం రూ.1,677 వద్ద ముగిసిన ఈ షేర్లలో మదుపరులు రూ.1,725/1,775 టార్గెట్‌తో రూ.1,650 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.1,615ను స్ట్రిక్ట్‌ స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ కార్డ్స్‌: రెండేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కంపెనీ షేర్లకు రూ.680 వద్ద మరోసారి మద్దతు లభించింది. ఈ మధ్య డివిడెండ్‌ ఇవ్వడం, త్వరలో నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుండడంతో షేర్ల ధరలో మూమెంటమ్‌ కనిపిస్తోంది. గత వారం ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లు నెల రోజుల గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. శుక్రవారం భారీ వాల్యూమ్స్‌తో పాటు ఐదు శాతం లాభంతో రూ.730 వద్ద క్లోజయ్యాయి. రూ.785/915 టార్గెట్‌తో మదుపరులు రూ.700/720 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.690ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌బీసీసీ: రెండు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం టర్న్‌ అరౌండ్‌ కనిపిస్తోంది. రూ.104 వద్ద మద్దతు తీసుకుని క్రమంగా పెరుగుతోంది. గత వారం ఏకంగా 9.28 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ బ్రేకవడం, డెలివరీ వాల్యూమ్స్‌ పెరగడం ఈ కౌంటర్‌కు ఉన్న సానుకూల అంశాలు. మదుపరులు రూ.145/160 టార్గెట్‌తో రూ.132 పైన పొజిషన్లు తీసుకోవచ్చు. కాకపోతే రూ.130ని స్ట్రిక్ట్‌ స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐసీఐసీఐ లొంబార్డ్‌: చక్కటి అప్‌ట్రెండ్‌ తర్వాత ఈ కౌంటర్‌లో అక్యుములేషన్‌ పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిలో కోట్‌ అవుతున్నాయి. ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ సైతం పెరుగుతున్నాయి. బ్రోకరేజి సంస్థలు బై రేటింగ్‌ ఇవ్వడం ఈ కౌంటర్‌కు మరో సానుకూల అంశం. త్వరలో క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించబోతోంది. దీంతో ఈ కౌంటర్‌లో మరింత మూమెంటమ్‌ కనిపిస్తోంది. గత వారం 4.85 శాతం లాభంతో రూ.1,717 వద్ద ముగిసింది. రూ.1,770/1,850 టార్గెట్‌తో మదుపరులు రూ.1,700 వద్ద ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. కాకపోతే రూ.1,660ని స్ట్రిక్ట్‌ స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌సీసీ: ఇంజనీరింగ్‌, నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ షేర్లలో బలం కనిపిస్తోంది. మల్టీ ఇయర్‌ బ్రేకవుట్‌తో ఈ కౌంటర్‌ మంచి జోరు మీద ఉంది. సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకేందుకు పరుగులు పెడుతోంది. ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్స్‌ గణనీయంగా పెరుగుతున్నాయి. గత వారం ఎన్‌సీసీ షేర్లు 6.90 శాతం లాభంతో రూ.272.70 వద్ద ముగిశాయి. రూ.290/310 టార్గెట్‌తో మదుపరులు రూ.260 వద్ద ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.240ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీమాస్టర్‌

Updated Date - Apr 08 , 2024 | 05:55 AM