Share News

గుండె జబ్బుకు లీహెల్త్‌ ఔషధం లిఫోస్టెరాల్‌

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:31 AM

న్యూట్రాస్యూటికల్స్‌ తయారీలోని హైదరాబాద్‌కు చెందిన లీ హెల్త్‌ డొమైన్‌ గుండెకు సమర్థవంతమైన రక్షణ కల్పించే పోలీపిల్‌ లిఫోస్టెరాల్‌ తయారుచేసింది. హృద్రోగంపై విస్తృత పరిశోధన అనంతరం...

గుండె జబ్బుకు లీహెల్త్‌ ఔషధం లిఫోస్టెరాల్‌

హైదరాబాద్‌: న్యూట్రాస్యూటికల్స్‌ తయారీలోని హైదరాబాద్‌కు చెందిన లీ హెల్త్‌ డొమైన్‌ గుండెకు సమర్థవంతమైన రక్షణ కల్పించే పోలీపిల్‌ లిఫోస్టెరాల్‌ తయారుచేసింది. హృద్రోగంపై విస్తృత పరిశోధన అనంతరం ఈ సాఫ్ట్‌జెల్‌ కాప్సూల్‌ తయారుచేసినట్టు కంపెనీ ప్రకటించింది. పాత వెల్లుల్లి రసం, గామా ఒరైజెనాల్‌, ఫైటోస్టెరాల్‌, లికోపిన్‌, నానో కర్కుమిన్‌, ఫెనూగ్రీక్‌, పైపరిన్‌ వంటి ప్రకృతిసిద్ధమైన పదార్ధాలతో ఇవి తయారుచేసినట్టు కంపెనీ డైరెక్టర్‌ ఆళ్ల లీలారాణి తెలిపారు. ఇది కొలెస్టరాల్‌, ట్రైగ్లిసరైడ్స్‌ను సమతూకం చేస్తూ గుండెకొట్టుకోవడాన్ని క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. ఇది అమెజాన్‌, లీ హెల్త్‌ డొమైన్‌ పోర్టళ్లలోను, అన్ని ప్రధాన ఫార్మసీల్లోను అందుబాటులో ఉంటుందని ఆమె వెల్లడించారు.

Updated Date - Mar 26 , 2024 | 01:31 AM