Share News

అత్యంత విలువైన కంపెనీల్లో ఏడో స్థానానికి ఎల్‌ఐసీ

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:44 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ షేరు శనివారం ట్రేడింగ్‌లో రూ.948 స్థాయి వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి కంపెనీ షేరు ధర 3.76 శాతం లాభంతో రూ.936 వద్ద ముగియడంతో మార్కెట్‌...

అత్యంత విలువైన కంపెనీల్లో  ఏడో స్థానానికి ఎల్‌ఐసీ

రూ.5.92 లక్షల కోట్లకు చేరిన కంపెనీ మార్కెట్‌ క్యాప్‌

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ షేరు శనివారం ట్రేడింగ్‌లో రూ.948 స్థాయి వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి కంపెనీ షేరు ధర 3.76 శాతం లాభంతో రూ.936 వద్ద ముగియడంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.92 లక్షల కోట్లు దాటింది. దాంతో ఐటీసీ, హెచ్‌యూఎల్‌ను వెనక్కినెట్టి ఎల్‌ఐసీ దేశంలోని ఏడో అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.949కు కొద్ది దూరంలో ఉంది. 2022 మే 17న ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే, బీఎ్‌సఈలో ఎల్‌ఐసీ షేరు 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్టయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది మార్చి చివర్లో షేరు ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.530.20 కి పతనమైంది. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. జీవిత కాల కనిష్ఠ స్థాయి నుంచి 77 శాతం పుంజుకుంది.

Updated Date - Jan 21 , 2024 | 01:44 AM