Share News

ప్రపంచంలో శక్తిమంతమైన బీమా బ్రాండ్‌ ఎల్‌ఐసీ

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:33 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ).. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. ఈ ఏడాదికిగాను విడుదల చేసిన ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100’ రిపోర్టులో...

ప్రపంచంలో శక్తిమంతమైన బీమా బ్రాండ్‌ ఎల్‌ఐసీ

బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ రిపోర్టు విడుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ).. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. ఈ ఏడాదికిగాను విడుదల చేసిన ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100’ రిపోర్టులో ఈ విషయం వెల్లడించారు. 980 కోట్ల డాలర్ల బ్రాండ్‌ విలువతో పాటు బ్రాండ్‌ శక్తి సూచీలో 88.3 పాయింట్లు, ట్రిపుల్‌ ఏ బ్రాండ్‌ రేటింగ్‌తో ఎల్‌ఐసీ అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. కాగా, తైవాన్‌కు చెందిన క్యాథే లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్‌ వరుసగా ఈ జాబితాలో 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది క్యాథే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బ్రాండ్‌ విలువ 9 శాతం పెరిగి 490 కోట్ల డాలర్లకు చేరుకోగా.. ఎన్‌ఆర్‌ ఎంఏ బ్రాండ్‌ వేల్యూ 82 శాతం వృద్ధితో 130 కోట్ల డాలర్లుగా నమోదైంది. కాగా, ప్రపంచంలోని అత్యంత విలువైన బీమా బ్రాండ్లలో చైనా ఆధిపత్యం కొనసాగిం ది. పింగ్‌ యాన్‌ (3,360 కోట్ల డాలర్లు) ప్రపంచంలో అత్యంత విలువైన ఇన్సూరెన్స్‌ బ్రాండ్‌గా నిలిచింది. చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సీపీఐసీ 3, 5 స్థానాల్లో ఉన్నాయి. జర్మనీకి చెందిన అలెయాన్జ్‌, ఫ్రాన్స్‌కు చెందిన ఆక్సా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ విషయంలో 2, 4 స్థానాల్లో కొనసాగాయి.

Updated Date - Mar 27 , 2024 | 01:33 AM