Share News

మ్యాట్రిక్స్‌ ఫార్మాలో కోటక్‌ ఆల్టర్నేట్‌ రూ.1,445 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:00 AM

నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని మ్యాట్రిక్స్‌ ఫార్మా.. దేశీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలను ఆకర్షిస్తోంది. కోటక్‌ మహీంద్రా గ్రూప్‌లోని ఆల్టర్‌నేటివ్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కోటక్‌ ఆల్టర్నేట్‌ అసెట్‌ మేనేజర్స్‌ లిమిటెడ్‌ (కేఏఏఎంఎల్‌) మ్యాట్రిక్స్‌...

మ్యాట్రిక్స్‌ ఫార్మాలో కోటక్‌ ఆల్టర్నేట్‌ రూ.1,445 కోట్ల పెట్టుబడి

ముంబై: నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని మ్యాట్రిక్స్‌ ఫార్మా.. దేశీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలను ఆకర్షిస్తోంది. కోటక్‌ మహీంద్రా గ్రూప్‌లోని ఆల్టర్‌నేటివ్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కోటక్‌ ఆల్టర్నేట్‌ అసెట్‌ మేనేజర్స్‌ లిమిటెడ్‌ (కేఏఏఎంఎల్‌) మ్యాట్రిక్స్‌ ఫార్మాలో రూ.1,445 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈక్విటీ, రుణాల రూపంలో ఈ పెట్టుబడి పెట్టినట్టు కేఏఏఎంఎల్‌ తెలిపింది. మ్యాట్రిక్స్‌ ఫార్మా ఈ నిధులను అమెరికా కేంద్రంగా పనిచేసే వయాట్రిస్‌ కంపెనీకి చెందిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) వ్యాపార కొనుగోలుకు వినియోగిస్తుంది. ఈ కొనుగోలుతో యాంటీరిట్రోవైరల్‌ (ఏఆర్‌వీ) ఏపీఐల వ్యాపారంలో మ్యాటిక్స్‌ ఫార్మా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఎదగనుంది.


కేఏఏఎంఎల్‌ ఈ నిధులను కోటక్‌ స్ట్రాటజిక్‌ సిట్యుయేషన్స్‌ ఫండ్‌-2 ద్వారా సమకూర్చింది. మైలాన్‌ ఎన్‌వీ- ఫైజర్‌ కంపెనీకి చెందిన అప్‌జాన్‌ యూనిట్ల విలీనంతో 2020లో వయాట్రిస్‌ ఇంక్‌ కంపెనీ ఏర్పాటైంది. కీలకేతర వ్యాపారాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంలో భాగంగా వయాట్రిస్‌ గత ఏడాది అక్టోబరులో భారత్‌లోని తన ఏపీఐ, ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారాలను 120 కోట్ల డాలర్లకు విక్రయించింది. ఇందులో ఏపీఐ వ్యాపారాన్ని నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌ అనుబంధ సంస్థ ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ బిజినె్‌సను స్పెయిన్‌కు చెందిన ఇన్సుడ్‌ ఫార్మా చేజిక్కించుకుంది.

Updated Date - Jun 12 , 2024 | 02:00 AM