పుణెలో కిమ్స్ ఆస్పత్రి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:52 AM
పుణె నగరంలో ఆస్పత్రి ఏర్పాటు కోసం 99 సంవత్సరాల కాలానికి స్థలం లీజు, భవనం కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ప్రకటించింది...

హైదరాబాద్: పుణె నగరంలో ఆస్పత్రి ఏర్పాటు కోసం 99 సంవత్సరాల కాలానికి స్థలం లీజు, భవనం కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ప్రకటించింది. 2.59 ఎకరాల విస్తీర్ణంలో, 2.72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల నిర్మిత ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ ఆస్పత్రి 300 పడకల సామర్థ్యం కలిగి ఉంటుందని, ఈ ప్రాజెక్టుపై రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని ప్రకటించింది. ముంబై-ఠాణే ప్రాంతంలో ఇదే తొలి ఆస్పత్రి అని, మహారాష్ట్రలో మూడో ఆస్పత్రి అని కిమ్స్ ఆ ప్రకటనలో తెలియచేసింది. నాసిక్‌లో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి నూతన ఆస్పత్రి వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభం కానున్నట్టు కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బీ భాస్కరరావు తెలిపారు.