Share News

సంగమం పవర్‌ ప్రాజెక్ట్స్‌ చేతికి కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్సీసెస్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:42 AM

కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేడీఎంఎ్‌సఎల్‌), దాని అనుబంధ సంస్థల కొనుగోలుకు సంగమం పవర్‌ ప్రాజెక్ట్స్‌ సమర్పించిన రిజొల్యూషన్‌ ప్రణాళికకు...

సంగమం పవర్‌ ప్రాజెక్ట్స్‌ చేతికి కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్సీసెస్‌

ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేడీఎంఎ్‌సఎల్‌), దాని అనుబంధ సంస్థల కొనుగోలుకు సంగమం పవర్‌ ప్రాజెక్ట్స్‌ సమర్పించిన రిజొల్యూషన్‌ ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఆమోదం తెలిపింది. కేడీఎంఎ్‌సఎల్‌ అనుబంధ సంస్థల్లో కార్వీ ఇన్నోటెక్‌ లిమిటెడ్‌ (కేటీఐఎల్‌), కార్వీ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (కేఆర్‌ఈపీఎల్‌) ఉన్నాయి. కట్టా సీతారాం రెడ్డి, అన్షుమన్‌ మోదుగు రెడ్డి నాయకత్వంలోని సంగమం పవర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ 2008 సంవత్సరం నుంచి పునరుత్పాదక ఇంధన విభాగంలో అగ్రగామిగా ఉంది. సోలార్‌, హైడ్రో, పవన విద్యుత్‌ రంగాల్లో స్పెషలైజ్‌ చేసింది. జస్టిస్‌ వెంకట రామకృష్ణ బదరీనాథ్‌ నందుల్‌, చరణ్‌ సింగ్‌ సభ్యులుగా గల ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌.. కేడీఎంఎ్‌సఎల్‌ కార్పొరేట్‌ దివాలా ప్రక్రియకు (సీఐఆర్‌పీ) ఆమోదం తెలుపుతూ తీర్పు ప్రకటించింది.


గత ఏడాది సెప్టెంబరులో మొదలైన సీఐఆర్‌పీ ప్రక్రియ అంతటినీ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ సుహాసినీ అశోక్‌ పర్యవేక్షించారు. 2008 నుంచి నిర్మించిన కేడీఎంఎ్‌సఎల్‌ వ్యాపార వారసత్వాన్ని పునరుద్ధరించి, ఆయా రంగాల్లో కంపెనీకి గల గుర్తింపును సొమ్ము చేయడంపై ఈ రిజొల్యూషన్‌ ప్రణాళిక ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

Updated Date - Dec 31 , 2024 | 06:26 AM