Share News

డల్లా్‌సలో జోయాలుక్కాస్‌ షోరూమ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 02:23 AM

అంతర్జాతీయ జువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ అమెరికాలోని డల్లా్‌సలో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ నెల 26న జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ సమక్షంలో డల్లాస్‌ కౌంటీ కమిషనర్‌ సుసాన్‌ ఫ్లెచర్‌...

డల్లా్‌సలో జోయాలుక్కాస్‌ షోరూమ్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ జువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ అమెరికాలోని డల్లా్‌సలో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ నెల 26న జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ సమక్షంలో డల్లాస్‌ కౌంటీ కమిషనర్‌ సుసాన్‌ ఫ్లెచర్‌, డిప్యూటీ మేయర్‌ టోనీ సింగ్‌, కౌన్సిల్‌ వుమెన్‌ టమ్మీ మీనర్‌ షగెన్‌ ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. అమెరికాలో కంపెనీ కస్టమర్స్‌ శరవేగంగా పెరుగుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని డల్లా్‌సలో షోరూమ్‌ను ప్రారంభించినట్లు జోయాలుక్కాస్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ తెలిపారు. షోరూమ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులు జువెలరీ కొనుగోళ్లపై ఉచిత గోల్డ్‌ కాయిన్స్‌ను పొందవచ్చన్నారు. అలాగే 2,000 డాలర్ల విలువ గల డైమండ్‌, పోల్కీ, పెరల్‌ జువెలరీ కొనుగోళ్లపై 1 గ్రాము గోల్డ్‌ కాయిన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు జోయాలుక్కాస్‌ తెలిపింది.

Updated Date - May 30 , 2024 | 02:23 AM