Share News

మార్కెట్లోకి జావా 42 ఎఫ్‌జే బైక్‌

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:32 AM

మహీంద్రా గ్రూప్‌ యాజమాన్యంలోని క్లాసిక్‌ లెజెండ్స్‌ మంగళవారం జావా 42 ఎఫ్‌జె మోటార్‌ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.1.99 లక్షలు. జావా వంటి బ్రాండ్లను పునరుజ్జీవింపచేయడంలో...

మార్కెట్లోకి జావా 42 ఎఫ్‌జే  బైక్‌

ధర రూ.1.99 లక్షలు

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌ యాజమాన్యంలోని క్లాసిక్‌ లెజెండ్స్‌ మంగళవారం జావా 42 ఎఫ్‌జె మోటార్‌ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.1.99 లక్షలు. జావా వంటి బ్రాండ్లను పునరుజ్జీవింపచేయడంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటామని ఈ బైక్‌ను విడుదల చేసిన సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ఈ బ్రాండ్లు మనకి ఎన్నో కథలు చెబుతాయంటూ ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇలాంటి బ్రాండ్లు ఎలాంటి ఉత్సుకత రేపుతాయో చూసేందుకు మనందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటామని చెప్పారు. 42 లైఫ్‌ సీరీ్‌సకు చెందిన జావా డిజైన్‌, ధర, పనితీరు అన్నింటిలోనూ చక్కని సమతూకాన్ని తెస్తుందని గ్రూప్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిష్‌ తెలిపారు. ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగంలో తాము ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నామని, అగ్రస్థానం సాధించడం తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - Sep 04 , 2024 | 02:32 AM