Share News

లీగల్‌ సర్వీస్‌లకు జీఎస్‌టీ వర్తిస్తుందా..?

ABN , Publish Date - May 26 , 2024 | 05:10 AM

ఒకప్పుడు న్యాయవాదులను సంప్రదించటం అనేది చాలా అరుదుగా జరిగేది. చిన్నచిన్న పంచాయితీలు, తగాదాలు ఏవైనా ఉన్నా స్థానికంగానే మాట్లాడి పరిష్కరించుకునే వారు. ఏదైనా కోర్టుకు సంబంధించిన వివాదాల్లోనే న్యాయవాదుల (లాయర్స్‌) పాత్ర ఉండేది. కానీ, ఇప్పుడు...

లీగల్‌ సర్వీస్‌లకు జీఎస్‌టీ వర్తిస్తుందా..?

ఒకప్పుడు న్యాయవాదులను సంప్రదించటం అనేది చాలా అరుదుగా జరిగేది. చిన్నచిన్న పంచాయితీలు, తగాదాలు ఏవైనా ఉన్నా స్థానికంగానే మాట్లాడి పరిష్కరించుకునే వారు. ఏదైనా కోర్టుకు సంబంధించిన వివాదాల్లోనే న్యాయవాదుల (లాయర్స్‌) పాత్ర ఉండేది. కానీ, ఇప్పుడు అనేక లావాదేవీల్లో భూమి, అపార్ట్‌మెంట్‌ కొనుగోలు వరకు, ఉద్యోగ నియమాకాలు, ఫర్మ్‌ లేదా కంపెనీ స్థాపన, కంపెనీల విలీనాలు, పన్నుకు సంబంధించిన వివాదాల వరకు లాయర్లు లేదా అడ్వకేట్స్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మెడికల్‌, ఇంజనీరింగ్‌ మాదిరి న్యాయ శాస్త్రంలో కూడా వివిధ విభాగాలు వస్తున్నాయి. అందుకే ఒకప్పుడు విడివిడిగా ప్రాక్టీస్‌ చేసే న్యాయవాదులు ఇప్పుడు కొంతమందితో ఒక భాగస్వామ్య సంస్థ (పార్ట్‌నర్‌షిఫ్‌ ఫర్మ్‌)ను ఏర్పాటు చేసి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు. మరి ఇలా అందించే లీగల్‌ సర్వీ్‌సల మీద జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం ఉందా? ఈ వివరాలు మీ కోసం..


లీగల్‌ సర్వీ్‌సలకు సంబంధించి జీఎ్‌సటీలో మొదటి రకం.. పన్ను మినహాయింపు పొందే సేవలు. ఇందులో అడ్వకేట్స్‌ భాగస్వామ్య సంస్థ లేదా అడ్వకేట్స్‌ (సీనియర్‌ అడ్వకేట్‌ను మినహాయించి) వస్తారు. వీరు మరొక అడ్వకేట్‌కు లేదా అడ్వకేట్స్‌తో కూడిన సంస్థకు, సాధారణ వ్యక్తులకు లేదా జీఎ్‌సటీలో రిజిస్ట్రేషన్‌ అవసరం లేని వ్యాపార సంస్థలకు ఇచ్చే లీగల్‌ సర్వీ్‌సలకు సంబంధించి ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇచ్చే న్యాయపరమైన సలహాలకు కూడా ఎలాంటి పన్ను వర్తించదు.

ఇక జీఎ్‌సటీ వర్తిస్తూ రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చే లీగల్‌ సర్వీ్‌సలు రెండో రకం. ఇందులో సీనియర్‌ అడ్వకేట్‌తో సహా అడ్వకేట్‌ లేదా ఫర్మ్‌.. ఒక వ్యాపార సంస్థకు (పైన చెప్పిన రిజిస్ట్రేషన్‌ అవసరం లేని వ్యాపార సంస్థలు కాకుండా మిగతా వ్యాపార సంస్థలకు) ఇచ్చే సర్వీ్‌సలకు సదరు వ్యాపార సంస్థ రివర్స్‌ మెకానిజంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ రెండో రకంలో పన్ను చెల్లించాల్సి ఉన్నా ఆ పన్నును సేవలు పొందిన సంస్థే చెల్లించాలి. అంతేకానీ అడ్వకేట్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇలా చెల్లించిన పన్నును ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) నియమ నిబంధనలకు లోబడి సదరు సంస్థలు క్రెడిట్‌ తీసుకోవచ్చు.


గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - May 26 , 2024 | 05:10 AM