Share News

రిలయన్స్‌ క్యాపిటల్‌ టేకోవర్‌కు హిందూజాకు ఐఆర్‌డీఏఐ ఆమోదం

ABN , Publish Date - May 12 , 2024 | 03:01 AM

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ను టేకోవర్‌ చేసేందుకు హిందూజా గ్రూప్‌ కంపెనీ ఇండ్‌సఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఐఐహెచ్‌ఎల్‌)కు ఐఆర్‌డీఏఐ షరతులతో కూడిన...

రిలయన్స్‌ క్యాపిటల్‌ టేకోవర్‌కు హిందూజాకు ఐఆర్‌డీఏఐ ఆమోదం

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ను టేకోవర్‌ చేసేందుకు హిందూజా గ్రూప్‌ కంపెనీ ఇండ్‌సఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఐఐహెచ్‌ఎల్‌)కు ఐఆర్‌డీఏఐ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రిలయన్స్‌ క్యాపిటల్‌ను రూ.9,650 కోట్లకు ఐఐహెచ్‌ఎల్‌ దక్కించుకుంది. అయితే, ఐఆర్‌డీఏఐ అనుమతితో రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన బీమా వ్యాపార అనుబంధ సంస్థలైన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆస్తులను తమ గ్రూప్‌లోకి బదిలీ చేసుకునేందుకు ఐఐహెచ్‌ఎల్‌కు మార్గం సుగమమైంది.

Updated Date - May 12 , 2024 | 03:01 AM