Share News

ఇన్వెస్టర్ల సంపద రూ.8.5 లక్షల కోట్లు అప్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:23 AM

ఈక్విటీ మార్కెట్‌ బుధవారం వరుసగా నాలుగో రోజున కూడా లాభాలతో ముగిసింది. మెటల్‌, కమోడిటీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగినప్పటికీ టెలికాం, ఐటీ, టెక్‌ కౌంటర్లలో చివరి గంట లో సాగిన...

ఇన్వెస్టర్ల సంపద రూ.8.5 లక్షల కోట్లు అప్‌

మార్కెట్లో నాలుగో రోజూ కొనసాగిన ర్యాలీ

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ బుధవారం వరుసగా నాలుగో రోజున కూడా లాభాలతో ముగిసింది. మెటల్‌, కమోడిటీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగినప్పటికీ టెలికాం, ఐటీ, టెక్‌ కౌంటర్లలో చివరి గంట లో సాగిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌ లాభాలకు కళ్లెం వేసింది. ఫలితంగా ఇంట్రాడేలో 383.16 పాయింట్ల లాభంతో 74,852.94 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరికి లాభాలను 114.49 పాయింట్లకే పరిమితం చేసుకుని 73,852.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.40 పాయింట్ల లాభంతో 22,402.40 వద్ద క్లోజైంది. ఈ నాలుగు రోజుల ర్యాలీలో సెన్సెక్స్‌ 1,363.95 పాయింట్లు పెరిగింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ కూడా రూ.8,48,328.90 కోట్లు పెరిగి రూ.4,01,37,377.21 కోట్లకు చేరింది.

Updated Date - Apr 25 , 2024 | 05:23 AM