Share News

అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:37 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మా ర్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు...

అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మా ర్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తే మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు అమెరిక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటన సూచీలకు దన్నుగా మారింది. అంతకుముందుతో పోల్చితే మార్కెట్‌ బ్రెడ్త్‌ క్రమంగా మెరుగుపడుతోంది. ఫియర్‌ ఇండెక్స్‌ సైతం తగ్గుతోంది. నిఫ్టీ మార్చి ఫ్యూచర్స్‌ మద్దతు 22,050 వద్ద, నిరోధం 22,300 వద్ద ఉన్నాయి. సోమవారం హోలీ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. కాగా శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు. మొత్తంగా ఈ వారం మార్కెట్‌ మూడు రోజులు మాత్రమే పనిచేయనుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

హిందాల్కో: కొన్నాళ్ల క్రితం గ్యాప్‌డౌన్‌ అయిన ఈ కౌంటర్‌ ప్రస్తుతం నిలదొక్కుకుంటోంది. రూ.520 స్థాయిలో మంచి బేస్‌ ఏర్పడింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. గత శుక్రవారంఈ షేరు రూ.547 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.540 పై స్థాయి లో ప్రవేశించి రూ.600/625 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.520 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

సన్‌ ఫార్మా: ఈ కంపెనీ సుదీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. ఫిబ్రవరి నుంచి రూ.1,530 స్థాయి లో అక్యుములేషన్‌ జరుగుతోంది. ఈ కౌంటర్‌లో ఆటుపోట్లు సైతం తక్కువగా ఉన్నాయి. గత శుక్రవారం రూ.1,608 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,600 స్థాయి లో ప్రవేశించి రూ.1,750/1,810 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,545 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఇండస్‌ టవర్‌: టెక్నికల్‌గా చూస్తే ఈ కౌంటర్‌లో చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. గత వారం ఈ షేరు నెల గరిష్ఠ స్థాయిని అధిగమించింది. చివరి ఐదు రోజుల్లో డెలివరీ వాల్యూమ్‌ 2.2 రెట్లు పెరిగింది. పైగా అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ను బ్రేక్‌ చేసింది. గత శుక్రవారం ఈ షేరు 8.43 శాతం లాభంతో రూ.271 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.260 స్థాయిలో ప్రవేశించి రూ.340 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.235 స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హీరో మోటోకార్ప్‌: ప్రస్తుతం ఆటో రంగ షేర్లు దూకుడు ను ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతోంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ‘బై’ రేటింగ్‌ ఇవ్వటం సానుకూల అంశం. గత శుక్రవారం ఈ షేరు రూ.4,684 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.4,650 స్థాయిలో ఎంటరై రూ.4,800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,620 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌: గత కొన్ని నెలలుగా ఈ కౌంటర్‌ సైడ్‌వే్‌సలో సాగుతోంది. రూ.220 స్థాయిల్లో చక్కని రౌండ్‌బాటమ్‌ ఏర్పడింది. ఇదే కీలక మద్దతుగా ఉంటోంది. గత వారం ఈ షేరు నెల గరిష్ఠాన్ని అధిగమించింది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.220 పై స్థాయిల్లో ప్రవేశించి రూ.285/310 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.205 స్థాయిని స్టాప్‌లాస్‌ గా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

Updated Date - Mar 26 , 2024 | 01:37 AM