Share News

అంతర్జాతీయ పరిణామాలే కీలకం..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:13 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎన్నికలు, అంతర్జాతీయ అంశాలు.. మార్కెట్లపై ప్రభావం చూపించే వీలుంది...

అంతర్జాతీయ పరిణామాలే కీలకం..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎన్నికలు, అంతర్జాతీయ అంశాలు.. మార్కెట్లపై ప్రభావం చూపించే వీలుంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఫియర్‌ ఇండియా విక్స్‌ పెరగటం దీన్ని ప్రతిబింబిస్తోంది. వరుసగా నాలుగు వారాలు లాభపడ్డ నిఫ్టీ గత వారం 1.65 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీకి 21,900 వద్ద మద్దతు, 22,150 వద్ద నిరోధ స్థాయిలున్నాయి. ఒకవేళ సూచీ 22,000 ఎగువన నిలదొక్కుకుంటే 22,600 వెళ్లే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల్లో కన్సాలిడేషన్‌ జరిగి అప్‌ట్రెండ్‌ బాట పట్టొచ్చు. ఆర్థిక ఫలితాల సీజన్‌ మొదలవటంతో ఎంపిక చేసిన షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం బెటర్‌.

స్టాక్‌ రికమండేషన్స్‌

ట్రెంట్‌: జీవితకాల గరిష్ఠాల్లో సాగుతున్న ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ గణనీయంగా పెరుగుతోంది. నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.71 లాభపడి రూ.4,158 స్థాయిల్లో క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.4,150/4,130 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.4,255/ 4,300 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,100 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బ్లూడార్ట్‌: సుదీర్ఘకాలంగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు టర్న్‌ అరౌండ్‌ అవుతోంది. క్రమక్రమంగా వాల్యూమ్‌ పెరుగుతోంది. డైలీ టైమ్‌ ఫ్రేమ్‌లో రూ.6,195 వద్ద నిరోధాన్ని అధిగమించింది. క్రితం నెల, వారం గరిష్ఠాలను క్రాస్‌ చేసింది. గత శుక్రవారం ఈ షేరు రూ.183 మేరకు లాభపడి రూ.6,297 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.6,250/6,270 స్థాయిల్లో ప్రవేశించి రూ.6,455/6,490 టార్గెట్‌ ధరతో పొజిషన్‌ తీసుకోవచ్చు. అయితే రూ.6,220 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్కార్ట్స్‌: ఈ షేరు జీవితకాల గరిష్ఠానికి చేరిన తర్వాత ఈ కౌంటర్‌లో కరెక్షన్‌ జరిగింది. గత ఏడాది అక్టోబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ షేరు క్రమంగా లాభాల్లో పయనిస్తోంది. మార్చి మూడో వారం నుంచి బైయింగ్‌ వాల్యూమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు 2.93 శాతం లాభంతో రూ.3,106 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.3,100 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.3,180/3,240 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,075 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

రేమండ్‌: ఈ కౌంటర్‌కు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. చివరి ఐదు సెషన్లలో డెలివరీ వాల్యూమ్‌ 3.7 రెట్లు పెరిగింది. షేరు విలువ అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ను క్రాస్‌ చేసింది. అంతక్రితం వారం గరిష్ఠ స్థాయిని అధిగమించింది. కన్సాలిడేషన్‌ జరిగింది. గత శుక్రవారం ఈ షేరు 5.33 శాతం లాభంతో రూ.2,011 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.2,000 స్థాయిల్లో ప్రవేశించి రూ.2,110/2,165 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,970 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మోతీలాల్‌ ఓస్వాల్‌: బెంచ్‌ మార్క్‌ సూచీలతో సంబంధం లేకుండా ఈ స్టాక్‌ బ్రోకింగ్‌ షేరు గణనీయంగా రాణిస్తూ వస్తోంది. సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తోంది. డెలివరీ, వాల్యూమ్‌ గణనీయంగా పెరుగుతోంది. బోనస్‌ షేర్లు ఇవ్వాలని యోచిస్తుండటం మరో సానుకూల అంశం. గత శుక్రవారం ఈ షేరు 7.02 శాతం లాభంతో రూ.2,232 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.2,200 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.2,355 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అరుతే రూ.2,160 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

Updated Date - Apr 22 , 2024 | 04:13 AM