హైదరాబాద్‌లో ఇంటెల్ ఏఐ, గేమింగ్ జోన్
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:45 AM
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్‌లో తొలి ఏఐ, గేమింగ్ జోన్‌ను ప్రారంభించింది. విశాల్ పెరిఫెరల్స్ భాగస్వామ్యంతో ఈ జోన్‌ను ప్రారంభించినట్లు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్‌లో తొలి ఏఐ, గేమింగ్ జోన్‌ను ప్రారంభించింది. విశాల్ పెరిఫెరల్స్ భాగస్వామ్యంతో ఈ జోన్‌ను ప్రారంభించినట్లు ఇంటెల్ డైరెక్టర్, హెడ్ సిస్టమ్స్ రాహుల్ మల్హోత్రా, సీనియర్ మేనేజర్ అరుణ్ రాఘవన్ తెలిపారు. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఈ జోన్‌ను డిజైన్ చేసినట్లు విశాల్ పెరిఫెరల్స్ డైరెక్టర్ విశాల్ హిసారియా పేర్కొన్నారు. ఇంటెల్‌కు చెందిన కటింగ్ ఎడ్డ్ టెక్నాలజీలను వినియోగించటంతో పాటు ఆసక్తి కలిగిన విద్యార్ధులకు ప్రొగ్రామింగ్, ఏఐ డెవల్‌పమెంట్, గేమింగ్‌లో తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు తోడ్పాటునందించనున్నట్లు విశాల్ తెలిపారు. ఈ ఇంటెల్ ఏఐ, గేమింగ్ జోన్‌ను విద్యార్ధులు పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో రెండో గేమింగ్ జోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.