Share News

ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:43 AM

విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు భారత ఈక్విటీ మార్కెట్‌ పట్ల రోజురోజుకు మరింతగా విశ్వాసం పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌...

ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడుల వెల్లువ

2023లో రూ.1.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌

న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు భారత ఈక్విటీ మార్కెట్‌ పట్ల రోజురోజుకు మరింతగా విశ్వాసం పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ పటిష్ఠంగా ఉండటంతో 2023 సంవత్సరంలో ఎఫ్‌పీఐలు.. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను గుమ్మరించారు. ఇందులో రూ.66,134 కోట్లు ఒక్క డిసెంబరు నెలలోనే రావటం గమనార్హం. 2024లో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో ఎఫ్‌పీఐలు.. రానున్న రోజుల్లో పెట్టుబడులు మరింతగా పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2023లో భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా డెట్‌ మార్కెట్లోకి రూ.68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ రెండింటిని కలిపితే మొత్తంగా ఎఫ్‌పీఐలు రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌పీఐలు 2022లో రూ.1.21 లక్షల కోట్లు, 2021లో కేవలం రూ.25,752 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా 2020లో మాత్రం రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Updated Date - Jan 01 , 2024 | 02:43 AM