Share News

భారత మీడియా, వినోద రంగం 2026లో రూ.3 లక్షల కోట్లకు..

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:57 AM

గత ఏడాది భారత మీడియా, వినోద రంగం 8.1 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని మంగళవా రం విడుదలైన ఫిక్కీ-ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో...

భారత మీడియా, వినోద రంగం 2026లో రూ.3 లక్షల కోట్లకు..

ఫిక్కీ-ఈవై సంయుక్త నివేదిక

న్యూఢిల్లీ: గత ఏడాది భారత మీడియా, వినోద రంగం 8.1 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని మంగళవా రం విడుదలైన ఫిక్కీ-ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇండస్ట్రీ 10.2 శాతం వృద్ధితో రూ.2.55 లక్షల కోట్లకు.. 2026లో రూ.3.08 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అంతేకాదు, ఈ ఏడాదిలో డిజిటల్‌ మీడియా విభాగం టెలివిజన్‌ సెగ్మెంట్‌ను అధిగమించి రూ.75,100 కోట్ల స్థాయికి పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొంది. మరిన్ని విషయాలు..

  • గత ఏడాదిలో రూ.69,600 కోట్ల మార్కెట్‌ సైజుతో టీవీ అతిపెద్ద విభాగంగా కొనసాగిం ది. 2024లో టీవీ మార్కెట్‌ రూ.71,800 కోట్లకు పెరగవచ్చని అంచనా.

  • 2023లో రూ.65,400 కోట్ల స్థాయికి చేరుకున్న డిజిటల్‌ మీడియా విభాగం.. ఈ ఏడాదిలో రూ.75,100 కోట్ల స్థాయికి చేరుకోవచ్చు. అంటే, ఇప్పటివరకు దేశీయ మీడియా, వినోద రంగంలో అతిపెద్ద విభాగంగా కొనసాగుతున్న టెలివిజన్‌ మార్కెట్‌ సైజును మించిపోనుంది.

  • 2026 నాటికి డిజిటల్‌ మీడియా విభాగం రూ.95,500 కోట్లకు చేరుకోవచ్చని, 2023-26 మధ్యకాలంలో ఈ విభాగం 13.5 శాతం సీఏజీఆర్‌తో దూసుకెళ్లనుందని అంచనా. కాగా, టీవీ మీడియా 2026లో రూ.76,600 కోట్ల స్థాయికి చేరుకోవచ్చునంటున్నారు. డిజిటల్‌ మీడియా కంటే ఇది 20 శాతం తక్కువ.

  • వచ్చే రెండేళ్లలో డిజిటల్‌ ప్రకటనల విభాగం 13.5 శాతం సీఏజీఆర్‌తో రూ.84,200 కోట్ల స్థాయికి చేరనుంది. ఇంటర్నెట్‌ సేవల వ్యాప్తి శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో స్మార్ట్‌ టీవీల విభాగం 50 శాతం వృద్ధి చెందింది.

  • బ్రాడ్‌బాండ్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ సేవల వినియోగదారులు 90.4 కోట్లకు చేరుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు అనూహ్యంగా పెరిగిన ఫలితంగా ఇంటర్నెట్‌ సేవల వినియోగ సగటు కూడా పెరుగుతోంది.

  • భారత మీడియా, వినోద రంగం మొత్తం ఆదాయంలో టెలివిజన్‌, ప్రింట్‌, సినిమాలు, లైవ్‌ ఈవెంట్లు, అవుట్‌ ఆఫ్‌ హోమ్‌ (ఓఓహెచ్‌), మ్యూజిక్‌, రేడియో వంటి సంప్రదాయ మీడియా వాటా తగ్గుతూ వస్తోంది. 2019లో ఇది 76 శాతంగా ఉండగా.. 2023లో 57 శాతానికి తగ్గింది.

  • గేమింగ్‌, డీ2సీ బ్రాండ్లు ప్రచార ఖర్చులు తగ్గించుకోవడంతో గత ఏడాది టీవీ యాడ్‌ రెవెన్యూ 6.5 శాతం తగ్గింది.

  • భారత ప్రింట్‌ మీడియా మాత్రం అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా మెరుగైన పనితీరు ను కనబరిచింది. గత ఏడాది ప్రింట్‌ మీడి యా యాడ్‌ రెవెన్యూ 4 శాతం పెరిగింది. సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయంలో 3 శాతం వృద్ధి నమోదైంది.

Updated Date - Mar 06 , 2024 | 12:57 AM