Share News

రాబోయే మూడేళ్లూ భారత్‌ దూకుడే : ప్రపంచ బ్యాంక్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:55 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రాబోయే మూడు సంవత్సరాలూ భారత్‌ 6.7 శాతం నిలకడ వృద్ధితో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్‌...

రాబోయే మూడేళ్లూ భారత్‌ దూకుడే : ప్రపంచ బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రాబోయే మూడు సంవత్సరాలూ భారత్‌ 6.7 శాతం నిలకడ వృద్ధితో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అయితే ప్రపంచ వృద్ధి 2024 సంవత్సరంలో 2.6 శాతంగా ఉండి 2025-26లో 2.7 శాతం అవుతుందని తాజా నివేదికలో పేర్కొంది. కొవిడ్‌-19కి ముందు దశాబ్ది కాలంలో నమోదైన 3.1 శాతం సగటు వృద్ధి కన్నా ఇది తక్కువే. కాగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ప్రైవేట్‌ వినియోగంలో వృద్ధి పెరగనున్నట్టు పేర్కొంది.

Updated Date - Jun 12 , 2024 | 01:55 AM