Share News

అలా్ట్రటెక్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌ గ్రైండింగ్‌ యూనిట్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:15 AM

మహారాష్ట్రలో ఇండియా సిమెంట్స్‌కు చెందిన గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.315 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ అలా్ట్రటెక్‌ ప్రకటించింది. మహారాష్ట్రలోని పార్లీలో ఏటా 10.1 లక్షల టన్నుల...

అలా్ట్రటెక్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌ గ్రైండింగ్‌ యూనిట్‌

డీల్‌ విలువ రూ.315 కోట్లు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఇండియా సిమెంట్స్‌కు చెందిన గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.315 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ అలా్ట్రటెక్‌ ప్రకటించింది. మహారాష్ట్రలోని పార్లీలో ఏటా 10.1 లక్షల టన్నుల సామర్థ్యం గల ఈ గ్రైండింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అలా్ట్రటెక్‌ పేర్కొంది. ఈ కొనుగోలుతో మహారాష్ట్ర మార్కెట్లో కంపెనీ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి ఈ యూనిట్‌ టర్నోవర్‌ రూ.250.66 కోట్లుగా ఉండగా నికర ఆస్తి విలువ రూ.75.10 కోట్లుగా ఉందని తెలిపింది. కాగా పార్లీ యూనిట్‌తో పాటు ఇదే రాష్ట్రంలో కంపెనీకి చెందిన ధూలే యూనిట్‌ విస్తరణ కోసం మొత్తం రూ.504 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు బోర్డు అనుమతినిచ్చిందని అలా్ట్రటెక్‌ వెల్లడించింది. ఇందులో పార్లీ యూనిట్‌ సామర్థ్యాన్ని ఏటా 12 లక్షల టన్నులకు విస్తరించేందుకు రూ.166.4 కోట్లు, ధూలే యూనిట్‌ విస్తరణ కోసం రూ.338 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్ల విస్తరణకు అవసరమైన మొత్తాలను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారా సమీకరించుకోనున్నట్లు పేరొంది.

Updated Date - Apr 22 , 2024 | 04:15 AM