Share News

IT Recruitment : హైదరాబాద్‌లో పెరిగిన ఐటీ నియామకాలు

ABN , Publish Date - May 25 , 2024 | 05:49 AM

ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో స్లబ్దత కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్‌ నెల నియామకాలతో పోలిస్తే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.6% పడిపోయాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక

 IT Recruitment : హైదరాబాద్‌లో పెరిగిన ఐటీ నియామకాలు

దేశవ్యాప్తంగా మాత్రం స్తబ్ధత

హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో స్లబ్దత కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్‌ నెల నియామకాలతో పోలిస్తే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.6% పడిపోయాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో బెంగళూరులో 24%, హైదరాబాద్‌లో 41.5% ఐటీ కొలువుల నియామకాలు పెరిగాయి. ఐటీ కొలువుల పోస్టింగ్ప్‌ సంస్థ ఇండీడ్‌ ఈ విషయం తెలిపింది. ఐటీ కొలువుల క్లిక్స్‌ పరంగా చూసినా హైదరాబాద్‌ ఈ విషయంలో బెంగళూరు కంటే చాలా ముందుంది. హైదరాబాద్‌లో ఐటీ జాబ్స్‌ కోసం క్లిక్‌ చేసే వారి సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 161% పెరిగితే, బెంగళూరులో 80% మాత్రమే పెరిగాయి.

Updated Date - May 25 , 2024 | 05:49 AM