Share News

ఎస్‌ఎంఈ ఐపీఓ దరఖాస్తు సైజు పెంపు

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:00 AM

అధిక రిస్క్‌తో కూడిన చిన్న, మధ్య తరహా కంపెనీ (ఎస్‌ఎంఈ)ల ఐపీఓల నుంచి రిటైల్‌ మదుపరులను రక్షించేందుకు సెబీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఎస్‌ఎంఈ ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు కనీస సైజును...

ఎస్‌ఎంఈ ఐపీఓ దరఖాస్తు సైజు పెంపు

రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు...

చర్చా పత్రాన్ని విడుదల చేసిన సెబీ

న్యూఢిల్లీ: అధిక రిస్క్‌తో కూడిన చిన్న, మధ్య తరహా కంపెనీ (ఎస్‌ఎంఈ)ల ఐపీఓల నుంచి రిటైల్‌ మదుపరులను రక్షించేందుకు సెబీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఎస్‌ఎంఈ ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు కనీస సైజును రూ.4 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించింది. అధిక పెట్టుబడి, అధిక రిస్క్‌ సామర్థ్యంతో పాటు కంపెనీ పట్ల పూర్తి అవగాహన కలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే ఈ ఐపీఓల్లో పాలుపంచుకునేలా చూడటమే ఈ ప్రతిపాదన ముఖ్యోద్దేశం. ఎందుకంటే, గత కొన్నేళ్లలో ఎస్‌ఎంఈ ఐపీఓల కోసం దరఖాస్తు చేసుకునే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దరఖాస్తుదారులు- షేర్లు లభించిన ఇన్వెస్టర్ల సగటు నిష్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4 రెట్లకు పెరగగా.. 2022-23 లో 46 రెట్లకు, 2023-24లో ఏకంగా 245 రెట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంఈ ఐపీఓల కనీస దరఖాస్తు సైజును


రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని మంగళవారం విడుదల చేసిన చర్చాపత్రంలో సెబీ ప్రతిపాదించింది. కనీస సైజును రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే గనుక ఎస్‌ఎంఈ ఐపీఓల్లో పాల్గొనే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.

Updated Date - Nov 20 , 2024 | 03:00 AM