Share News

నష్టాల బాటలోనే..!

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:07 AM

గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లో నెలకొన్న బేరి్‌షనెస్‌ దృష్ట్యా ఈ వారం కూడా నష్టాల బాటలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి...

నష్టాల బాటలోనే..!

గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లో నెలకొన్న బేరి్‌షనెస్‌ దృష్ట్యా ఈ వారం కూడా నష్టాల బాటలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీకి 21,600 వద్ద ప్రధాన మద్దతు ఉంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 21,450/21,250 స్థాయిల వరకు సూచీ పతనం కావచ్చు. నిఫ్టీ 22,000 స్థాయిని అధిగమిస్తే మాత్రం బుల్లి్‌షనెస్‌ వస్తుంది. ఈ వారం ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, ఆటోమొబైల్స్‌, లోహ రంగాల్లోని షేర్లు లాభపడే అవకాశం ఉంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: గత ఏడాది అక్టోబరు నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు డిసెంబరు నుంచి కన్సాలిడేటెడ్‌ అవుతోంది. రెండు నెలలుగా రూ.2,050 స్థాయిలో మంచి బేస్‌ ఏర్పడింది. ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు తగట్టుగా ఉండటంతో శుక్రవారం ఈ షేరు 5.41 శాతం లాభంతో రూ.2,168 దగ్గర క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.2,150/2,170 శ్రేణిలో ప్రవేశించి రూ.2,250/2,290 టార్గెట్‌ ధరతో పొజిషన్‌ తీసుకునే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,120 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: డిసెంబరు త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించటంతో ఈ షేరు దూకుడు కనబరుస్తోంది. జనవరి చివరి వారం నుంచి ఈ షేరుకు డిమాండ్‌ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.265.85 వద్ద క్లోజైంది. పొజిషినల్‌ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.260 శ్రేణిలో ప్రవేశించి రూ.290/310 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.250 స్థాయిని స్టాప్‌లా్‌సగా

పెట్టుకోవాలి.

అంబుజా సిమెంట్స్‌: నిఫ్టీతో పోలిస్తే ఈ షేరు మెరుగ్గా ట్రేడవుతోంది. కొన్ని నెలలుగా కన్సాలిడేట్‌ అయిన ఈ కౌంటర్‌లో నవంబరు నెల చివరలో బుల్లి్‌షనెస్‌ మొదలైంది. ఇప్పటికీ అదే జోరును కనబరుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమీప నిరోధ స్థాయి రూ.600ను బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. గత శుక్రవారం ఈ షేరు రూ.576.60 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.570 శ్రేణిలో ప్రవేశించి రూ.620/690 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.558 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

భారత్‌ ఫోర్జ్‌: సుదీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో ఈ మధ్య స్వల్ప దిద్దుబాటు జరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు రౌండింగ్‌ బాటమ్‌ ఏర్పడింది. పైగా ఫలితాలు బాగుండటంతో షేరు దూసుకుపోతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,319.45 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ,1,300 స్థాయిల్లో ప్రవేశించి రూ.1,450/1,525 టార్గెట్‌ ధరతో పొజిషన్‌ తీసుకునే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,275 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

థెర్మాక్స్‌ లిమిటెడ్‌: గత ఏడాది నవంబరు 30న ఈ కౌంటర్‌లో భారీగా కొనుగోళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌ను ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.3,345 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ,3,330/3,300 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ,3,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,275 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

Updated Date - Feb 12 , 2024 | 05:07 AM