Share News

సైయెంట్‌ డీఎల్‌ఎంలో

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:43 AM

తన అనుబంధ విభాగమైన సైయెంట్‌ డీఎల్‌ఎంలో 14.5 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్లో బ్లాక్‌ డీల్స్‌ ద్వారా విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు...

సైయెంట్‌ డీఎల్‌ఎంలో

14.5 శాతం వాటా విక్రయం

రూ.860 కోట్లు సమీకరించే అవకాశం

తన అనుబంధ విభాగమైన సైయెంట్‌ డీఎల్‌ఎంలో 14.5 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్లో బ్లాక్‌ డీల్స్‌ ద్వారా విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మంగళవారం వెల్లడించింది. సైయెంట్‌ డీఎల్‌ఎంలో 14.5 శాతం వాటాకు సమానమైన 1.149 కోట్ల షేర్లను ఈ నెల 21న (బుధవారం) విక్రయించనున్నట్లు తెలిపింది. ఒక్కో షేరు కనీస ధరను రూ.748.65 గా నిర్ణయించింది. తద్వారా సైయెంట్‌కు రూ.860.9 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఈ నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు నిర్వహణ మూలధన అవసరాలకు వినియోగించుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బ్లాక్‌ డీల్‌ అనంతరం సైయెంట్‌ డీఎల్‌ఎంలో సైయెంట్‌ వాటా 66.66 శాతం నుంచి 52.16 శాతానికి తగ్గనుంది.

Updated Date - Aug 21 , 2024 | 05:43 AM