Share News

కరెన్సీ డెరివేటివ్స్‌ నిబంధనల అమలు మే 3కు వాయిదా

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:18 AM

ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ కరెన్సీ డెరివేటివ్స్‌ (ఈటీసీడీ) నిబంధనల అమలును మే 3కు వాయిదా వేస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. మార్కెట్‌ వర్గాల నుంచి అందుకున్న సూచనలు, అభిప్రాయాలతో...

కరెన్సీ డెరివేటివ్స్‌ నిబంధనల అమలు మే 3కు వాయిదా

ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ కరెన్సీ డెరివేటివ్స్‌ (ఈటీసీడీ) నిబంధనల అమలును మే 3కు వాయిదా వేస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. మార్కెట్‌ వర్గాల నుంచి అందుకున్న సూచనలు, అభిప్రాయాలతో పాటు ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ నిబంధనల అమలును ఆర్‌బీఐ నెల రోజుల పాటు వాయిదా వేసింది. మార్కెట్లో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ను అరికట్టేందుకు ఆర్‌బీఐ కరెన్సీ డెరివేటివ్స్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ జనవరి 5న సర్క్యులర్‌ జారీ చేసింది. దాని ప్రకారం కొత్త నిబంధనలు ఈ నెల 5 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

Updated Date - Apr 05 , 2024 | 02:18 AM