Share News

ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:18 AM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరింత బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుంచే...

ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరింత బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుంచే చెల్లించిన ప్రీమియంపై వంద శాతం రిఫండ్‌ ఇచ్చే ఆప్షన్‌ను ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ వెల్లడించింది. ఈ తరహా యాన్యుటీ ప్లాన్‌ను తీసుకురావటం పరిశ్రమలో ఇదే తొలిసారని తెలిపింది. సింగిల్‌ లైఫ్‌ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీ ప్లాన్‌ కింద వినియోగదారులకు జీవితాంతం చెల్లింపులు చేయనుంది. జాయింట్‌ లైఫ్‌ ఆప్షన్‌తో కూడిన ప్లాన్‌లో ఒకవేళ ఎవరైనా మరణిస్తే వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లేదా సోదరులకు చెల్లింపులు చేయనుంది. జాయింట్‌ ఆప్షన్‌లో ఎవరైనా ఒకరు మరణిస్తే భవిష్యత్‌ ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపును ఇస్తోంది.

Updated Date - Jan 21 , 2024 | 02:18 AM