Share News

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,696 కోట్లు

ABN , Publish Date - Jul 28 , 2024 | 02:02 AM

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం జూన్‌ త్రైమాసికానికి వార్షిక ప్రాతిపదికన 9.96 శాతం వృద్ధితో రూ.11,695.84 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్‌ లాభం రూ.10,636.12 కోట్లుగా...

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,696 కోట్లు

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం జూన్‌ త్రైమాసికానికి వార్షిక ప్రాతిపదికన 9.96 శాతం వృద్ధితో రూ.11,695.84 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్‌ లాభం రూ.10,636.12 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ క్యూ1లో బ్యాంక్‌ స్టాండలోన్‌ లాభం 14.62 శాతం వృద్ధితో రూ.11,059 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.45,998 కోట్లకు ఎగబాకింది. గత ఏడాది జూన్‌ త్రైమాసికాదాయం రూ.38,763 కోట్లుగా ఉంది. వ్యయాలు రూ.24,624 కోట్ల నుంచి రూ.29,973 కోట్లకు ఎగబాకాయి. ఈ క్యూ1లో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 7.3 శాతం పెరిగి రూ.19,552.9 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 4.36 శాతానికి తగ్గింది. ఎన్‌ఐఎం 4.40 శాతంగా ఉండగా.. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో 4.78 శాతంగా నమోదైంది.


మొండి బకాయిలు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 2.15 శాతానికి (రూ.28,718.6) కోట్లకు తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 0.43 శాతానికి (రూ.5,684.8 కోట్లు) పెరిగాయి. మొండిబకాయిల కోసం బ్యాంక్‌ రూ.1,332.2 కోట్ల కేటాయింపులు జరిపింది.

Updated Date - Jul 28 , 2024 | 02:02 AM