Share News

ఏపీ, తెలంగాణల్లో హ్యుండయ్‌ డిజిటల్‌ ఫ్లోట్‌ కార్యక్రమం

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:03 AM

కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో డిజిటల్‌ ఫ్లోట్‌ కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల ముంగిటిలోనే...

ఏపీ, తెలంగాణల్లో హ్యుండయ్‌ డిజిటల్‌ ఫ్లోట్‌ కార్యక్రమం

హైదరాబాద్‌: కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో డిజిటల్‌ ఫ్లోట్‌ కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల ముంగిటిలోనే తమ ఉత్పత్తుల అనుభూతిని కలిగించడం ఈ కార్యక్రమం లక్ష్యం. 4 డిజిటల్‌ ఫ్లోట్లను ప్రవేశపెట్టడం ద్వారా రెండు రాష్ర్టాల్లోని 75కి పైగా గ్రామీణ ప్రాంతాలను కవర్‌ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రాండ్‌ ఐ10 నియోస్‌, ఎక్స్‌టర్‌, వెన్యూలను నేరుగా వినియోగదారుల ముంగిటికే తరలించి వాటి అనుభూతి కస్టమర్‌కు కలిగేలా చేస్తారు. కంపెనీ ఆర్‌ఎ్‌సహెచ్‌ రామ్‌కుమార్‌, ఆర్‌పిఎ్‌సహెచ్‌ స్వప్నిల్‌ చౌదరి, ఇతర అధికారులు ఇం దుకు సంబంధించి డిజిటల్‌ వ్యాన్లను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 02:03 AM