Share News

స్టార్ట్‌పలకు అనుకూల నగరం హైదరాబాద్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:58 AM

ఆసియాలో స్టార్ట్‌పలకు అనుకూల వాతావరణం ఉన్న ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. అమెరికాకు చెందిన స్టార్టప్‌ జెనోమ్‌ సంస్థ ‘‘2024 గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌’’ పేరిట...

స్టార్ట్‌పలకు అనుకూల నగరం హైదరాబాద్‌

హైదరాబాద్‌: ఆసియాలో స్టార్ట్‌పలకు అనుకూల వాతావరణం ఉన్న ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. అమెరికాకు చెందిన స్టార్టప్‌ జెనోమ్‌ సంస్థ ‘‘2024 గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌’’ పేరిట విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్‌కు ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ జాబితాలో హైదరాబాద్‌ 19వ స్థానంలో నిలిచింది. పనితీరు,నిధుల కల్పన,ప్రతిభ,అనుభవం, మార్కెట్‌ పరిశోధన,పరిజ్ఞానం కొలమానాలుగా ఈ సర్వే నిర్వహించారు. 2014లో 200 స్టార్ట్‌పల స్థాయి నుంచి నేడు 7,500 స్టార్ట్‌పలు గల నగరంగా హైదరాబాద్‌ నిలవడం గర్వకారణమని టీహబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస రావు అన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 01:58 AM