Share News

భారీగా పెరిగిన ఒలెక్ట్రా లాభం

ABN , Publish Date - Jan 28 , 2024 | 06:03 AM

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 22.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.12.97 కోట్లు)తో పోల్చితే...

భారీగా పెరిగిన ఒలెక్ట్రా లాభం

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 22.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.12.97 కోట్లు)తో పోల్చితే లాభం 72 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.250.12 కోట్ల నుంచి రూ.334.65 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు కూడా రూ.232.82 కోట్ల నుంచి రూ.304.73 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ నాన్‌- ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ చిల్లప్పగారి లక్ష్మీ రాజం రాజీనామాను డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని, ఇది శనివారం నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది.

Updated Date - Jan 28 , 2024 | 07:00 AM