పదేళ్ల గరిష్ఠ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:19 AM
హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ిగత ఆరు నెలల్లో 1,73,241 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ...

న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ిగత ఆరు నెలల్లో 1,73,241 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. గత పదేళ్లలో ఎన్నడూ ఈ నగరాల్లో ఇన్ని ఫ్లాట్లు, ఇళ్లు అమ్ముడుపోలేదని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది.
హైదరాబాద్‌లో మరింత పైకి: హైదరాబాద్ రియల్టీ గత ఆరు నెలల్లో 18,573 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ముంబై, ఢిల్లీతో సహా దేశంలో మరే ప్రధాన నగరంలోనూ ఇంత భారీ వృద్ధిరేటు నమోదు కాలేదు. ఆఫీసు స్పేస్ లీజుల విషయంలోనూ ఇదే పరిస్థితి. గత ఆరు నెలల్లో హైదరాబాద్‌లో 50 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీసు స్పేస్ కోసం లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 71 శాతం ఎక్కువని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.