హెరిటేజ్ ఫుడ్స్ ఆర్థిక ఫలితాలు అదుర్స్
ABN , Publish Date - Oct 24 , 2024 | 01:39 AM
హెరిటేజ్ ఫుడ్స్ సెప్టెంబరు త్రైమాసికానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,019.5 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై...
క్యూ2లో రూ.48.6 కోట్ల నికర లాభం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్ సెప్టెంబరు త్రైమాసికానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,019.5 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.83.2 కోట్ల స్థూల లాభం, రూ.48.6 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4.2 శాతం మాత్రమే పెరిగినా, స్థూల లాభం 76.8 శాతం, నికర లాభం 117 శాతం పెరిగాయి. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లు మించడం ఈ సంవత్సరం ఇది రెండోసారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ రూ.2,052.2 కోట్ల ఆదాయంపై రూ.177 కోట్ల స్థూల లాభం, రూ.107.1 కోట్ల నికర లాభం ఆర్జించింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 7.9 శాతం మాత్రమే పెరిగినా, స్థూల లాభం 102.7 శాతం, నికర లాభం 173 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రోజుకు సగటున 16.4 లక్షల లీటర్ల పాలు సేకరించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.46 శాతం అధికం.