దాణా ఉత్పత్తులపై జీఎస్‌టీ తగ్గించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:49 AM
పౌలీ్ట్ర రంగానికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని పౌలీ్ట్ర ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. ఇండియన్ పౌలీ్ట్ర ఎక్వి్‌పమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్...

పౌల్ర్టీ ఇండియా అధ్యక్షుడు బయాస్ విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): పౌలీ్ట్ర రంగానికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని పౌలీ్ట్ర ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. ఇండియన్ పౌలీ్ట్ర ఎక్వి్‌పమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పౌలీ్ట్ర ఇండియా ఎక్స్‌పో- 2024ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, పోషకాహారానికి మూలస్తంభమైన పౌలీ్ట్ర రంగానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ దిగుమతులకు సత్వర అనుమతులు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. దాణా తయారీలో ప్రధాన ముడి పదార్ధాలైన మొక్కజొన్న, సోయాలపై జీఎ్‌సటీ భారం తగ్గించాలని కోరారు. ఎగ్జిబిషన్‌కు పెద్దసంఖ్యలో కోళ్ల పరిశ్రమ వర్గాలు తరలివచ్చాయి. .