Share News

రూ.6 కోట్ల జీఎ్‌సటీ ఎగవేత

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:44 AM

వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) రూ.5.89 కోట్లను ఎగవేసిన ఏఎస్‌ మెట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రాష్ట్ర పన్నుల అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు...

రూ.6 కోట్ల జీఎ్‌సటీ ఎగవేత

ఏఎస్‌ మెట్‌ సంస్థపై పన్ను అధికారుల కేసు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) రూ.5.89 కోట్లను ఎగవేసిన ఏఎస్‌ మెట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రాష్ట్ర పన్నుల అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కంపెనీ సీఈఓ, డైరెక్టర్‌ పీయూష్‌ మెహతాపై అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసినట్లు రాష్ట్ర పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. పెద్ద మొత్తంలో జీఎ్‌సటీని ఎగవేసినట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది డిసెంబరు 24, 26 తేదీల్లో సికింద్రాబాద్‌, తిరుమలగిరి ప్రాంతాల్లోని కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేసట్టినట్లు వివరించారు. 2018 నుంచి 2022 అక్టోబర్‌ మధ్య ఎంఎస్‌ పైప్స్‌, టీఎంటీ బార్స్‌, టీఎంటీ రీబార్స్‌, సీఆర్‌ఎ్‌ఫహెచ్‌ స్టీల్‌ కాయిల్స్‌, ఐరన్‌, స్టీల్‌ ఎంఎస్‌ రౌండ్స్‌ వంటిని సరఫరా చేసినట్లు తప్పుడు పన్ను ఇన్వాయిస్‌, వాహనాలకు వే బిల్లులను జారీ చేశారని వివరించారు. ఎగవేత పన్ను రూ.5 కోట్లకు మించినందున.. జీఎ్‌సటీ చట్టం కింద నాన్‌-బెయిలబుల్‌ కేసును నమోదు చేశామన్నారు. పీయూష్‌ మెహతాపై అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేశామని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 01:44 AM