జీఆర్‌టీ జువెలర్స్ స్వర్ణ దీపావళి ఆఫర్లు
ABN , Publish Date - Oct 18 , 2024 | 01:34 AM
జీఆర్‌టీ జువెలర్స్ దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో స్వర్ణ దీపావళి, తమిళనాడులో తంగా దీపావళి పేరుతో వినియోగదారులకు ఈ ఆఫర్లను...
హైదరాబాద్: జీఆర్‌టీ జువెలర్స్ దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో స్వర్ణ దీపావళి, తమిళనాడులో తంగా దీపావళి పేరుతో వినియోగదారులకు ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీపావళి సందర్భంగా జీఆర్‌టీ జువెలర్స్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు ‘సిల్వర్ ఫర్ గోల్డ్’ ఆఫర్ కింద దానికి సమాన బరువు గల వెండిని పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. జీఆర్‌టీ జువెలర్స్ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దీపావళికి వజ్రాలపై క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్ కట్ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండిని ఉచితంగా అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే వెండి వస్తువుల (ప్రత్యేక వస్తువులు మినహాయించి) మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు సహా గిఫ్ట్ ఆర్టికల్స్ ఎంఆర్‌పీపై 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్ తెలిపింది.