Share News

పెట్‌ ఫుడ్స్‌ విభాగంలోకి గ్రోవెల్‌

ABN , Publish Date - May 21 , 2024 | 01:58 AM

ఆక్వాకల్చర్‌ ఫీడ్స్‌ కంపెనీ గ్రోవెల్‌ గ్రూప్‌.. పెంపుడు జంతువుల పోషకాహార (పెట్‌ ఫుడ్స్‌) విభాగంలోకి ప్రవేశించింది. ఫుల్లర్‌, డాట్‌గుడ్‌ బ్రాండ్‌ పేరుతో పెట్‌ బిస్కె ట్స్‌ (ట్రీట్‌)ను...

పెట్‌ ఫుడ్స్‌ విభాగంలోకి గ్రోవెల్‌

  • ఫుల్లర్‌, డాట్‌గుడ్‌ బ్రాండ్‌తో ఉత్పత్తుల విడుదల

హైదరాబాద్‌: ఆక్వాకల్చర్‌ ఫీడ్స్‌ కంపెనీ గ్రోవెల్‌ గ్రూప్‌.. పెంపుడు జంతువుల పోషకాహార (పెట్‌ ఫుడ్స్‌) విభాగంలోకి ప్రవేశించింది. ఫుల్లర్‌, డాట్‌గుడ్‌ బ్రాండ్‌ పేరుతో పెట్‌ బిస్కె ట్స్‌ (ట్రీట్‌)ను కంపెనీ విడుదల చేసింది. వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా పెంపుడు జంతువుల పోషకాల విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రమోటర్‌ గ్రూప్‌, గ్రోవెల్‌ ఎంఎస్‌ఆర్‌ కార్తీక్‌ తెలిపారు. దేశీయ పెట్‌ పరిశ్రమ ఏటా 10 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, 2027 నాటికి ఇది 100 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పెట్‌ ట్రీట్స్‌ మార్కెట్‌ రూ.650 కోట్లుగా ఉందని, 2027 నాటికి రూ.1,900-2,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గ్రోవెల్‌ గ్రూప్‌.. ఆక్వా ఫీడ్స్‌, ఫార్ములేషన్‌, సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యాపారాలను నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.2,000 కోట్లుగా ఉందని కార్తీక్‌ తెలిపారు. కంపెనీ హైదరాబాద్‌లో రెండు ఫార్ములేషన్‌ యూనిట్లు.


ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయపాలెంలో రెండు ఫీడ్స్‌, సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నిర్వహిస్తోందన్నారు. కాగా ఈ పెట్‌ ఫుడ్‌ కోసం సింగరాయపాలెంలోని ప్రత్యేకంగా రెండు ప్రొడక్షన్‌ లైన్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ విభాగంలో రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కార్తీక్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాల్లోని రెండువేలకు పైగా ఔట్‌లెట్స్‌లో ఫుల్లర్‌, డాట్‌గుడ్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని గ్రోవెల్‌ గ్రూప్‌ పెట్‌ ఫుడ్‌ బిజినెస్‌ హెడ్‌ జేఎస్‌ రామకృష్ణ తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 01:58 AM