టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గవర్నర్
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:35 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఫైనాన్స్ పత్రిక ఈ ఎంపిక చేసింది...
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఫైనాన్స్ పత్రిక ఈ ఎంపిక చేసింది. దాస్ టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎంపికవడం వరుసగా ఇది రెండోసారి. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్- 2024 పేరుతో గ్లోబల్ ఫైనాన్ప్ పత్రిక ఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో పాటు డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ క్రిస్టియన్ కెట్టెల్ థామ్సన్, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జోర్డాన్‌లకు అత్యుత్తమ ఏ+ రేటింగ్ లభించింది.