Share News

గూగుల్‌లో మళ్లీ కొలువుల కోత

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:41 AM

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత కొనసాగుతోంది. ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా మరింత మందిని ఇంటికి పంపింది. అయితే ఎంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించిదనే...

గూగుల్‌లో మళ్లీ కొలువుల కోత

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్‌ కంపెనీల్లో కొలువుల కోత కొనసాగుతోంది. ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా మరింత మందిని ఇంటికి పంపింది. అయితే ఎంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించిదనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. హార్డ్‌వేర్‌, వాయిస్‌ అసిస్టెన్స్‌, ఇంజనీరింగ్‌ టీమ్స్‌లో ఈ తీసివేతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. గూగుల్‌ చర్యపై ఉద్యోగుల సంఘం మండిపడింది. తమ కష్టంతో ప్రతి త్రైమాసికంలో వందల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నా.. ఇలా అర్థాంతరంగా తమ పొట్ట కొట్టడం అన్యాయమని విమర్శించింది.

Updated Date - Jan 12 , 2024 | 05:41 AM