హైదరాబాద్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్
ABN , Publish Date - Mar 15 , 2024 | 04:54 AM
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ సమీపంలోని కోకాపేట వద్ద మూడు ఎకరాల భూమి...
మరో రియల్టీ ప్రాజెక్టు
హైదరాబాద్: ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ సమీపంలోని కోకాపేట వద్ద మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ప్రీమియం నివాస గృహ సముదాయం కోసం కొనుగోలు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,300 కోట్ల ఆదాయం వస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ మూడు ఎకరాలను ఎవరి నుంచి ఎంతకు కొనుగోలు చేశారు? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. నెల రోజుల క్రితం కూడా గోద్రెజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాస గృహ సముదాయం కోసం రూ.350 కోట్లతో 12.5 ఎకరాలు కొనుగోలు చేసింది.